“... 2010 మే లో రమణ తన "కోతి-కొమ్మచ్చి” సీరియల్‌కు విరామం ఇచ్చారు. వ్రాయవలసిన విషయాలు చాల ఉన్నాయని పాఠకులందరూ గుర్తు చేస్తూనే వున్నారు. మా బోటివాళ్ళం చనువు తీసుకుని దబాయిస్తూనే వున్నాం. "ఓపిక తగ్గింది. ఇప్పుడు రాస్తే పస వుండదు. ఆరోగ్యం కుదుటపడగానే, యిదిగో ఉగాది నుండి మళ్ళీ రాస్తా" అంటూనే ఫిబ్రవరి 24, 2011న ప్రస్థానమైపోయారు రమణగారు. వారి దివ్యస్మృతికి అంజలి ఘటిస్తూ, ఇది ఆత్మకథ కాబట్టి అసంపూర్ణంగా వున్నా, మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగ ప్రచురిస్తున్నాం.

“కోతి-కొమ్మచ్చి” పుస్తకం యింటనుండడం ఒక ప్రతిష్ఠాత్మక విషయంగా పాఠకులు భావించారు. మొదటి భాగం ఇప్పటికి ఏడు ప్రచురణలు పొందగా, రెండవ భాగం నాలుగు ప్రచురణలు పొందింది. రమణగారి 80వ జయంతి సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నాం...”

- వరప్రసాద్, ప్రచురణకర్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good