కంచి కామాక్షీదేవిని దర్శించి, భావావేశంతో మూకశంకరుల వారు చెప్పిన మూకపంచశతీ కావ్యంలో మొత్తం ఐదు శతకాలున్నాయి. వీటిలో అమ్మవారి దివ్యవైభవాన్ని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు, అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ నూటమూడు  శ్లోకాలు, కామాక్షీదేవి లీలల్ని స్తుతిస్తూ నూటరెండు శ్లోకాలు, దేవి కటాక్షాలని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు, కామాక్షీ అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు రచించారు. వీటినే వరుసగా 1.ఆరాయశతకం, 2. పాదారవింద శతకం, 3. స్తుతి శతకం, 4. కటాక్ష శతకం, 5. మందస్మిత శతకం అంటారు.

కంచి కామాక్షీదేవికి సంబంధించిన స్తుతులతో మూకపంచశతీ ఎంతో గొప్ప స్తుతికావ్యంగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఎంతో భక్తి తత్పరతతో మూకశంకరులు రచించిన ఈ శతకంఓ ఐహికాముష్మిక ఫలాలను అందించే మహిమాన్వితమైన శ్లోకాలున్నాయి. సాక్షాత్తు అమ్మవారే మూకశంకరుల చేత ఈ దివ్యస్తుతుల్ని పలికించటంతో ఇందులోని శ్లోకాలు మంత్రాల్లా పనిచేస్తాయని భక్తుల విశ్వాసం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good