మన శరీరమంతా నరాల ద్వారా అనుసంధానింపబడిన'ఎలక్ట్రాన్ సర్క్యూట్' వంటిది. దాని 'టర్మినల్స్' వేలి కొనల్లో దాగి ఉంటుంది. చేతి వేళ్ళ కొనలను శక్తీ వాహకాలుగా చెప్పుకోవచ్చు. వేళ్ళలోని ఆ 'పాయింట్స్' నిర్దిష్టమైన రీతిలో కలపడం ద్వారా మన శరీర తత్వాలను మనం అనుకున్న రీతిలో నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. చేతివేళ్ళ ఈ టర్మినల్ పాయింట్స్ ని కలపడమే 'ముద్ర' పూజ విధానంలోనూ, యోగాభ్యాసంలోను, నాట్యకళలోనూ ముద్రలను ఉపయోగించడం మనం చూస్తుంటాం. దేవుళ్ళ, దేవతలమూర్తులన్ని'అభయ ముద్ర' లోనూ, దీవేనలిస్తున్నట్లుగానూ రూపొందిస్తుంటారు.
ఈ ముద్రల ప్రభావాన్ని తెలుసుకోవాలంటే, శారీరక తత్వాలను, దోషాలను, పంచభూతాలను సమన్వయ పరిచే టి.వి. రిమోట్ లాంటి స్విచ్ లు మన శరీరంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. వీణలోని తీగల బిగింపు, సడలింపులను అనుసరించే కదా సంగీతంలో తారాస్థాయి, ముద్రస్థాయిలను నియంత్రించడం సాధ్యపడుతుంది. అలాగే, శారీరక తత్వాలను సమన్వయ పరుచుకోవడానికి చేతివేళ్ళనుకావలిసిన రీతిలో అమర్చడం ఎలాగో తెలుసుకోవడం అతి ముఖ్యం. ముద్రావిజ్ఞానం శరీర మనసుల మధ్య సామ్యాన్ని కుదిర్చి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కల్గిస్తుంది. అలాంటి ముద్రాశాస్త్ర రహస్యాలు అబ్బురపరిచే అద్భుత ముద్రల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.      -స్వామి మైత్రేయ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good