నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాలవారు తమ లైంగిక సుఖంకోసం బసివినులుగా మార్చే దుష్ట, దుర్మార్గ సంప్రదాయాన్ని చిత్రిస్తూ వి.ఆర్.రాసాని ఈ నవలను రచించాడు. రాయలసీమ ప్రాంతంలోని బసివిని వ్యవస్ధ దౌష్ట్యాన్ని, అమానుషత్వాన్ని, ఆ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్ళతో ఎంతో సహజంగా పాఠకుల హృదయాలను ద్రవించేలా చిత్రించిన రాసానిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. - అంపశయ్య నవీన్
ఈ నవలిక చతురలో వచ్చింది. మంరి పేరొచ్చింది. కన్నడంలోకి వెళ్ళి, అప్పుడే రెండు కాపులు కాసింది. 'ముద్ర' నవల యిప్పటికే జనామోదం పొంది, తనని తాను నిరూపించుకుంది. కన్నడ, హింది, తమిళ భాషలలోకి అనువాదమై ముద్రపడింది. ఇక సంతృప్తికరమైన ముంగింపునిచ్చింది. ముద్ర నవలని నడిపించిన తీరు అర్ధవంతంగా, ఆసక్తికరంగాసాగింది. - శ్రీరమణ