విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీరు చదవబోయే కథల్లో ఈప్రమాణౄలు కనిపిస్తాయి. శ్రీకాకుళ పోరాటం నుంచి దండకారణ్య ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం దాకా విస్తరించిన విప్లవోద్యమాన్ని, వివిధ సామాజిక ఉద్యమాల చైతన్య క్రమాలను, సామ్రాజ్యవాద సంక్షోభాలను, వాటిపై సాగుతున్న పోరాట, భావజాల సంఘర్షణలను ఈ సంపుటాల్లోని అరుణతార కథల్లో చదువుకోవచ్చు. కార్యకర్తలు, పాఠకులు కథకులుగా మారే ప్రక్రియకు విరసం అధికార పత్రిక అరుణతార గత నాలుగు దశాబ్దాలుగా వేదికగా నిలిచిందనే సంగతి దృష్టిలో పెట్టుకుంటే ఈ కథల బలం ఇంకా బాగా తెలుస్తోంది.- విరసం
Rs.30.00
Out Of Stock
-
+