మూడేళ్ళ మోదీ పాలన

ముసుగులు తొలగిపోయాయి :

మతతత్వ దాడులకు తెరలేచింది

మోదీ ప్రభుత్వం పాలన మూడో యేడు ముగియడంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిల మతతత్వ ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. కాషాయిమూక విభజిత స్వభావానికి సిగ్గుమాలిన రూపమయిన యోగి ఆదిత్యనాథ్‌ని ఒక పెద్ద రాష్ట్రానికి అధినేతను చేయడంతోనే ఇది బట్టబయలయింది. మోదీ నాయకత్వంలో గెలిచిన యుపి పీఠంపై ఆదిత్యనాథ్‌ను కూర్చోపెట్టడం పూర్తిగా ఊహించనిది కాదు. నిజానికి ఇది ఎలక్షన్‌ ప్రచారం కొనసాగింపే. మోదీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. 'కబరిస్థాన్‌', షంమ్‌స్థాన్‌' అంటూ ప్రచారంలో మోదీయే స్వయంగా చర్చను రేపడం వలన ఈ నియామకం ఎన్నికల ప్రనచార కొనసాగింపు అనవలసి వస్తున్నది. నిజానికి ఇది షా & కంపెనీ మతతత్వాన్ని దట్టించి వండిన వంటకం పైపూత మాత్రమే. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లిమ్‌లు అధికంగా ఉన్న ప్రాంతం నుండి ''హిందువుల వలసలు'' అన్నది అందులోని మరో అంశం. ఈ అంశాన్నే ఆదిత్యనాధ్‌ తన ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పుకున్నారు. తన ఆధ్వర్యంలోని హిందూ యువ వాహిని ద్వారా పూర్వాంచల్‌ (ఉత్తర యుపి)ని ముస్లింల బెడదనుండి విముక్తి చేసి ముస్లింలకు వారి స్థానాన్ని వారికి చూపించానని ఆదిత్యనాథ్‌తో చెప్పించారు. ముస్లింలకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం, యాంత్రిక వధ్యశాలలన్నీ మూసి వేస్తానని ప్రకటించడం, లవ్‌ జిహాద్‌, తలాక్‌ వంటివి మరికొన్ని అంశాలు.....

ఈ పుస్తకంలో మోదీ పాలనలోని భిన్న పార్వ్వాలను చర్చించారు రచయిత.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good