మీ ముద్దు మురిపాల చిన్నారులకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతీ తల్లిదండ్రులూ తాపత్రయపడతారు. మీ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి వారుగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని వాకిరి మంచి పేర్లు పెట్టి ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని మీ పిల్లలు పెద్దయిన తరువాత నాకు మంచి పేరు పెట్టిన మిమ్మల్ని గౌరవించాలని ప్రతీ తల్లి దండ్రులూ కోరుకుంటారు.అందమైన పేర్లు పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అందుకే నక్షత్ర రీత్యా పిల్లలు పుట్టిన జన్మ నక్షత్ర పాదానికి తగిన పేరు పెట్టుకునే విధంగా 5555 పేర్లతో రూపొందించబడిన మొట్టమొదటి పుస్తకం ఇది. ఇందులో చిన్నారులకు పెట్టె పేర్లు తేలికగా ఉండేటట్లు జాగ్రత్త పడ్డాను. మేం ఇచ్చిన పేర్లు చివర మూర్తి, శర్మ, శాస్త్రి, చోదరి, నాయుడు, రెడ్డి అంటి మార్పులు చ్సుకోవచ్చు. మీరూ చదివి ప్రస్తుత జనరేషన్కి తగినట్లుగా మీ పిల్లలకు తగిన మోడ్రన్ పేర్లను ఎంపిక చేసుకోండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good