ఈ 'మృత్యు క్రీడ ప్రకృతి వైపరీత్య కథలు' పుస్తకంలో బీభత్స అక్షరం, పిశాచి కోర, మృత్యు క్రీడ, నిప్పు అనే నాలుగు కథలు వున్నాయి.

    ప్రకృతికీ, వాతావరణానికి అవినాభావ సంబంధం వుంటుంది. వీటి మధ్య ఒక సమతుల్యత వుంటుంది. ఈ సమతుల్యతలో వ్యత్యాసం వస్తేనే ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. అయితే సమతుల్యత దెబ్బ తినడానికి రోజు రోజుకీ వాతావరణ కాలుష్యాన్ని పెంచేస్తున్న మానవుల అనౌచిత కార్యక్రమాలు కూడా ఎక్కువ కారణం కావచ్చు. ఈ balance ను ధ్వంసం చేసే మరెన్నో కనిపించి, కనిపించని అంశాలు కూడా కారణం కావచ్చు.

    ప్రకృతి వైపరీత్యాలయిన భూకంప దృశ్యాలు, శేషాచలాన్ని దహించి వేసిన మంటల భీభత్సాలు ఈ కథలు రాయడానికి కారణమైనాయి. - డా|| వి.ఆర్‌.రాసాని

Write a review

Note: HTML is not translated!
Bad           Good