నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్ది - నా  లాంటి ఆడవాళ్ళు చాలా మంది కనిపించారు. వీళ్ళంతా తెలివిగల వాళ్ళు, సమర్ధులు...
జీవితంలో పెళ్లి అనేది ఒక కోణం మాత్రమే. అది నీకు ఆనందం యివ్వాలి గాని, అదఃపాతాళానికి అణగదోక్కకూడదు.అల తొక్కితే నువ్వు మల్లయుద్ధం చేసి తీరాల్సింది.
విజ్జూ !నువ్వు నాకు ఒక స్నేహితుడిని మాత్రమే అన్పిస్తునావు. నిన్ను పెళ్లి చేసుకున్నా నేను నీతో కూడా ఏదో గొడవలో పది నిన్ను పోగొట్టు కునేదాన్నేమో ! మన పెళ్లి కాకపోవడమే ణా అదృష్టం అని ఆలస్యంగా నైనా అర్ధం అయింది. 
జీవితంలో వెలుగు నీడల్ని దంపత్యం లోని మదిరిమనీ స్నేహం లోని తీయదనాన్ని చిత్రించే అపురూపమైన నవల మౌన తరంగాలు. విజయ్ జీవితం వడ్డించిన విస్తరి. కలిసొచ్చిన వ్యాపారం. చేతి నిండా డబ్బు. కానీ విధి చిన్న చూపు చూసింది. అన్నిటా తోడూ నీడగా మసలిన భార్య ఉమా కన్నుమూసింది. వారి దాంపత్యానికి ఒక తీపి గురుతు  చిన్ని, ఆ ఆమ్మాయి. తోడిదే అతని జీవితమంతా. ఇంకోవైపున మాధవి విజయ్ ని కోరుకుంది. ప్రేయసీ ప్రియుల్లాగానా రహస్య ఒప్పందం చేసుకున్న భార్యభార్తల్లాగానా ?
యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన ఈ నవల ఆంధ్ర జ్యోతి  డైలీ సీరియల్. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good