Rs.120.00
In Stock
-
+
మానవత్వానికీ - మంచితనానికీ మరో పేరు మదర్ థెరెసా. అభాగ్యులకూ, అనాధలకూ అమ్మవొడి థెరెసా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, రారండంటూ ఆప్యాయతా అనురాగంతో అక్కున చేర్చుకొనే అమృత మూర్తి మదర్ థెరెసా. నిరంతర కృషికీ, నిరాడంబరతకూ చిరునామా అమ్మ థెరెసా.
ఇంతటి మహనీయ త్యాగశీలి జీవిత చరిత్రను రాయటం మాటలు కాదు. దాన్ని సాధ్యం చేసిన వ్యక్తి శ్రీ నవీన్ చావ్లా. వీరు సుమారు 23 సంవత్సరాలు మదర్ థెరెసా సన్నిహిత మిత్రులలో ఒకరుగా ఉండటమే కాక, ఆమె నిర్వహించిన అనేకానేక సేవా కార్యక్రమాలకు అధికారికంగా చేయూత నిచ్చిన భారత ప్రభుత్వ ఐ.ఏ.యస్. అధికారి. ఆంగ్లంలో రాసిన ఈ జీవిత చరిత్రను మదర్ స్వంతంగా చదివి శుభాకాంక్షలందించిందంటేనే ఈ రచన సాధికారికత నిరూపితమవుతుంది. ఇప్పటికి ఇది ప్రపంచంలోని 14 భాషల్లోకి అనువాదం పొందింది.