ఆధునిక కథకి ఆద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచి రచయిత. రష్యన్‌ మహా రచయిత తలుస్తోయ్‌ (టాల్‌స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్‌ తత్త్వవేత్త నీషె మొపాసని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్‌సెట్‌ మామ్‌, ఓ హెన్రీ ఇద్దరూ - మొపాసని అనుసరించారు. ఎమిలీ బోలానీ మొపాస ఇష్టపడ్డారు. బాల్జాక్‌ని అభిమానించాడు. ఫ్లాబర్డ్‌ దీవెనలు అందుకున్నారు.

చిన్నప్పటినుంచీ మొపాసకి మతమంటే మంట. ఆయన యుద్ధవ్యతిరేకి. ఈ సంపుటిలోని శృంగార కథల్లో శృంగార వర్ణనలేమి ఉండవుకాని శృంగార నేపథ్యం ఉంటుంది. వ్యర్థ పదాలూ, వ్యర్థ వర్ణనలూ, వ్యర్థ వాక్యాలూ లేకుండా సునాయాసంగా, సాదాగా, సూటిగా ఉంటాయి ఆయన కథలన్నీ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good