సృష్టి యందలి జీవులన్నీ ఆహారమునకు, ఔషదములకు ప్రత్యక్షముగ లేక పరోక్షముగ వృక్షముల పై ఆధారపడి జీవించున్నవి. రోగముల కలిగినపుడు వానిని వారణార్ధము మూలికలు, ఖనిజములు, లోహాదులు ఔషధముగ వాడబడుచున్నవి. ఈ ఔశాదములను, మూలికలను గూర్చి సరియేనా అవగాహన , కనీస విద్యార్హత, లేని వారు కూడా మూకికా వైద్యములో పెద్ద పెద్ద రోగాలను చికిత్సలు చెప్పుచున్నారు. ఈ విధానము ఒకపుడు ప్రమాదకారిగా మారుచున్నది. రోగి యొక్క రోగమును నిర్మూలించుట కు శాస్గ్త్ర బద్దమైన చికిత్సా పాదములు వాని లక్షణములు ఆయుర్వేదమున చెప్పబడినవి. చికిత్సా పాదములు నాలుగు. అవి వైద్యుడు , ద్రవ్యము, పరిచారికుడు, రోగి, ఈ విధముగా చికిత్సకు ఇన్ని విషయములు కలిగి యుండును. కాని ఈ రోజులలో చికిత్స విధానములు తెలియని, వైద్యంలో డిగ్రీ లేనివారు ఎక్కువగా మూలికలను గూర్చి అతిశయోక్తిగా ప్రవర్తిస్తూ వైద్య సలహాలతో వైద్యం చేయటం, చేయించుకోవటం ఎంత ప్రమాదమో ప్రతివారు గ్రహించవలెను. మనిషిని యొక్క  ప్రక్రుతి బట్టి ఒకరికి అమృతమువలె పనిచేసిన ద్రవ్యము, మరియుకనికి,విషమువలె పనిచేయును. కనుక ఆయా వ్యక్తుల ప్రకృతిని పట్టి ఔషధముగా, ఆహారముగా  ద్రవ్యములను వాడుకోనవలెను. ఈ పుస్తకము వ్రాయుటకు సహకరించిన ఎందరో మహానుభావులకు, ఎంతగానో ప్రోత్సహమందించిన ఆ అందరికి కృతఙ్ఞతలు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good