పురుషార్ధాలు నాలుగు. ధర్మం, అర్ధం, కామం, మోక్షం: ఈ నాలుగింటినీ సక్రమంగా సాధించిన పురుషుడు 'పుణ్యపురుషుడు' అవుతాడు. మూడవ పురుషార్థం 'కామం' ఒక్కటే జీవిత పరమార్ధం కాదు 'స్వేచ్ఛా ప్రణయం' కామానికి పరాకాష్ట.
ఆశ్రమాలు నెలకొల్పి యువతుల్ని ఆకర్షించి, ధర్నాన్ని అతిక్రమించి, అర్ధాన్ని ఆశ్రయించి, మోక్ష ద్వారాలను మూసి వేస్తూ ఆర్షధర్మాలకు తలవంపులు తేవటం అక్కడక్కడ జరుగుతూనే వుంటుంది. అలాంటి ఆశ్రమాల్లో జరుగుతున్న కామకలాపాల్ని, గుట్టుమట్టుల్ని బట్టబయలు చేసి, కాషాయాంబరాల ముసుగులో దాగిన 'కామ పిశాచి' నగ్న రూపాన్ని అతిసుందరంగా చిత్రించారు రచయిత మూడో పురుషార్థం నవలలో.
ఆర్షధర్మ సమ్మిళితములైన ప్రాగ్దేశ వైభవ ప్రాభవాన్ని, అధునాతన భౌతిక పాశ్చాత్య భావప్రకంపనాల్ని, కూలంకషంగా చర్చించి, మధించి, అపూర్వ ప్రాక్పశ్చిమభావ సమ్మేళనా వైచిత్రిని పాఠకుల మనోయవనికలపై సాక్షాత్కరింప చేసిన శ్రీ చివుకుల పురుషోత్తం అపూర్వ రచన ! మూడో పురుషార్ధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good