'మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును' అని జాతివైతాళికుడు గురజాడ కలలుకని నూరేళ్ళు దాటింది. కానీ మన సమాజం మీద మతంపట్టు నానాటికీ బలపడుతోంది.

మనదేవంలో పాలకపార్టీ ఏదైనప్పటికీ సిక్కుల వూచకోత నుండి బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ మారణకాండ, ముజఫర్‌ నగర్‌ల మీదుగా నేటిదాకా హిందూత్వని ఆయుధంగా చేసుకొని పాలిస్తోంది. పేరుకి బిజెపి పాలన ఐనా మనం సంఘ్‌పరివార్‌ పాలనలోనే వున్నాం. బిజెపి ఒక మతతత్వ పార్టీ. దాని మూలాలు ఫాసిస్టు భావజాలం ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండడంవల్ల ప్రజల మీద నిరంకుశ పాలనను రుద్దుతోంది. హిందూత్వ దిశగా సమాజాన్ని పునర్నిర్మించడానికి పైనుండి రాజ్యాంగయంత్రం ద్వారా, కిందనుంచి హిందూత్వసంస్థల ద్వారా ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని హిందూదేశంగా, హిందూ సంస్కృతిని భారతీయసంస్కృతిగా, హిందూవాదమే భారతజాతీయవాదంగా సంఘ్‌పరివార్‌ ప్రచారం చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సనాతన బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థలో ఉంది. మధ్య యుగాలనాటి మూఢత్వం ఆధునిక శాస్త్రీయభావాలను అవహేళనచేస్తున్న పరిస్థితి నేడున్నది.

పేజీలు :32

Write a review

Note: HTML is not translated!
Bad           Good