ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గురించి ఇంజనీరింగ్‌ రంగంలో బహుశా తెలియనివారుండరు. ఆయన సేవలు బహుముఖంగా ఉన్నాయి. మైసూర్‌ రాజస్థానంలో దివాన్‌గా ప్రబుత్వపాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో తన ప్రతిభను నిరూపించుకున్న విశ్వేశ్వరయ్య నేటి పాలకులకు ఆదర్శనీయులు.

హైదరాబాదులో హుసేన్‌సాగర్‌ నిండినప్పుడు కిందకు నీళ్లు వెళ్లిపోవడానికి ఆయన ముందుచూపుతో ప్రణాళిక రచించి నిర్మింపజేసిన తూములను ఇటీవలకాలంలోనే గుర్తించి, వాటిని పరిశీలించిన ఇంజనీర్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేయడమేగాక నైపుణ్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. మైసూరు రాష్ట్రంలోనేగాక నిజాం పాలనలో, మహారాష్ట్ర ప్రాంతంలో డామ్‌ల నిర్మాణం, బొంబాయి కార్పోరేషన్‌ పాలనలో సులభరీతుల అమలులో, మురుగునీటి పారుదల సమస్య పరిష్కారంలో ఆయన కృషి, దక్షత అసామాన్యం. దేశంలోనేగాక, విదేశాలలోనూ తన సేవలందించిన విశ్వేశ్వరయ్య ముందుతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటారు.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good