శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది.

ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు

దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ.
డైలీ పేపర్ని తిరగేస్తుందామె.

మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్‌ని చూపించిందతనికి.

'డాక్టర్‌ మురళిని పోలీసులు ఇంటరాగేట్‌ చేస్తే' అనుమానంగా అడిగాడతను.

'అతను డాక్టర్‌, ఎవరో ఫోన్‌చేస్తూ ¬టల్‌కెళ్ళి మహేంద్రను టెస్ట్‌ చేశానని చెప్తాడు. మనం ఎవరన్నది తెలీదని చెప్తాడు. దట్సాల్‌. అయినా దేనికైనా సాక్ష్యాలుండాలి. పోలీసులు సాక్ష్యాలు సంపాదించే టైముకి మిగతా మర్డర్స్‌ కూడా జరిగిపోతాయి. డోన్ట్‌వర్రీ' ధీమాగా చెప్పింది మోహిత.

'ఫారెస్ట్‌ ఆఫీసరు జయంత్‌కి ఎప్పుడు మహూర్తం పెట్టావ్‌? అడిగాడు మైత్రేయ.

'నలభై ఎనిమిది గంటల తర్వాత'

'అతని అడ్రస్‌, వివరాలు తెలుసా?'

'తెలుసు'

'మర్డర్‌ ప్లాన్‌'

'నలభై గంటల తర్వాత చెబుతాను. తొందరపడకు' నవ్వుతూ అంది.

ఒక మర్డర్‌ తర్వాత మోహిత తనతో గడుపుతానన్న విషయం గుర్తొచ్చింది మైత్రేయకి. ఏదో అడగబోతున్న సమయంలో 'కాసేపు డ్రింక్‌తో కాలక్షేపం చేద్దాం. వెళ్ళి డ్రింక్‌ బాటిల్‌, మంచింగ్‌ తీసుకురా - వాచ్‌మెన్‌ని పిల్చి డిన్నర్‌ ఆర్డరిస్తాను' అందామె.

ఫ్రంట్‌ లైన్‌ రైటర్‌ శ్రీ సూర్యదేవర  రామ్‌మోహన్‌రావు రాసిన మర్డర్‌ మిస్టరీ నవలన 'మోహిత'లోని ఓ సన్నివేశమది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good