"రాధా!"

"నీవు చిత్రకారుడివి అయినప్పుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినప్పుడు నీ కలాన్ని నేనే అవుతాను... నీవు నర్తకుడివై నర్తిస్తున్నప్పుడు నీ కాలి చిరుగజ్జెను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినప్పుడు నేను నీ మోహనవంశిని."

"రాధా! నీ మధురాధరాలు అలయునేమో?"

"విశ్వమోహనమైన వేణుగానం సరస గంభీరంగా ధ్వనిస్తున్నప్పుడు - మధురమైన నీ మందహాసం మరో మానిని అనుభవిస్తున్నప్పుడు మహావేదాంతిని నీవు మానవజీవితంలోని వివిధ కోణాలని చిత్రిస్తున్నప్పుడు, నీ అధరాన్ని నేనే అవుతాను."

"వంశీ!"

"అవును రాధా! నా మాధుర్యం రాధా భావమే."

"వంశీ. అంతటి అదృష్టమా నాకు?"

"అదృష్టవంతుడను నేను మాత్రం కాదా రాధా?"

రాధామాధవుల మనోహర ప్రేమని మనముందుంచిన లత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good