'కరువు రక్కసి కోరలు ఏమిటయ్యా మోహన్‌ చెప్పు. కరువు లేకుండా చేసుకోవడం. అంటే ఏం చెయ్యాలి. పంటలు పండేలా చూసుకోవాలి. పంటలు పండటం అంటే రెగ్యులర్గఆ చేలకి నీళ్ళు...అంటే నీటి సరఫరా మన చేతుల్లో వుండాలి. వాన మీద ఆధారపడకుండా ముఖ్యంగా చెరువులూ, కాలవలూ ప్రతి వూరు వచ్చేలా చూసుకోవాలి. అంటే మరి మన నదులకి అవసరమైన ప్రతి చోటా ఆనకట్టలు కట్టుకోవాలి. ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా పంచవర్షాలు రావడం పోవడమే గాని ప్రణాళికలు రూపుదిద్దుకోవడమనేది ఎరగం గదా!  అదేమంటే ఫండ్సు లేవు అనేది తారక మంత్రం కన్నా దివ్యంగా పలుకుతారు మన ప్రభువులు. మొన్న ఏసియాడ్‌కి 1600 కోట్లు ఖర్చు పెట్టారు. మన నాగార్జున సాగర్‌కి ఖర్చయ్యిందెంతో తెలుసా. 553 కోట్లు. అంటే ఏమన్నమాట? ఏసియాడ్‌ మానేస్తే మూడు నాగార్జునసాగర్‌లాంటి ప్రాజెక్ట్‌లు కట్టొచ్చు. వుహూ మనకి ప్రాజెక్టులకన్నా ఆటలూ, వాటి వల్ల వచ్చే గొప్పలూ ముఖ్యం. అన్నంకన్నా ఆకాశయానాలు, ఆర్యభట్‌లూ ఆవశ్యం''.
''ప్రేమమయమైన జీవితం వుండటం సామాన్యమైన విషయమా? ఏ ప్రేమ లేకుండా ఎందరి జీవితాలు ముగిసిపోతున్నాయో? ప్రేమతో నిండిన జీవితం గురించి పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి! రమణమ్మగారు మిగిలినవారికన్నా ఇంత భిన్నంగా వున్నదెందుకుంటున్నారూ? తన జీవితంలో ప్రేమని తెల్సుకుని వుండటం వల్లనే ఆ రోజుల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వల్లనే''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good