హిందూత్వ ఉన్మాదం వెర్రి తలలు వేస్తున్న సమయం ఇది. ఆరెస్సెస్‌యేతర ఆలోచనా స్రవంతికి చెంది హేతుబద్ధంగా ఆలోచించేవారంతా ప్రాణాలరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం గత ఆరున్నర దశాబ్దాల్లో ఇంత తీవ్రమైన పరిస్థితి ఎన్నడూ దాపురించలేదు. ఆరెస్సెస్‌ అనుబంధ విభాగాలు దేశపు సాంస్కృతిక సాంఘిక జీవితాన్ని శాసించేందుకు పూనుకుంటున్నాయి. గోమాంసం వినియోగం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న దుర్ఘటనలు, అటువంటి దుర్ఘటనలను చూస్తూ ఊరుకుంటున్న పౌరసమాజం గురించి అర్థం చేసుకోవాలంటే దాదాపు శతాబ్దకాలం పాటు ఆరెస్సెస్‌ అనుసరించిన సైద్ధాంతిక రాజకీయ ప్రచారాన్ని అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ముస్లిం మైనారిటీలపై విద్వేష ప్రచారం సాగిస్తూ మరోవైపున మెజారిటీ హిందూమత పరిరక్షణ నినాదం మాటున సాగుతున్న మెజారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల తీవ్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సాంస్కృతిక విభాగం ముసుగులో ఆరెస్సెస్‌ గత శతాబ్దకాలంలో దేశవ్యాప్తంగా ఏర్పరుచుకున్న అంగనిర్మాణం, అందులో భాగంగా తెరమీదకు వస్తున్న కొత్త కొత్త సంస్థలు, కొత్త కొత్త నినాదాలకు ఆరెస్సెస్‌ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మీడియా కోడై కూస్తున్నట్లుగానే గత ఆర్నెల్లుగా దేశంలో జరుగుతున్న విద్వేషపూరిత మతోన్మాద ప్రేరేపిత హింసాకాండ, భావజాల రంగంలో తోసుకొస్తున్న సరికొత్త వాదనలు కేవలం అలగా సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ముందుకు తెస్తున్నవే తప్ప బిజెపి/ఆరెస్సెస్‌లకు వీటితో ఏ మాత్రం సంబంధం లేదన్న తప్పుడు అవగాహనతో కొట్టుకుపోతాము. - సీతారం ఏచూరి

Pages : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good