నరేంద్రమోదీపై వినోద్ కె. జోస్ రాసిన ఈ వార్తా కథనాన్ని 'సాహసపూరితమైనది'గా, 'ఎక్కడా రాజీపడకుండా రాసినది'గా 'చాలా శ్రద్ధగా పరిశోధించి రాసినదిగా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో వర్ణించారు.
గుజరాత్లో విస్తృతంగా పర్యటించి అనేకమంది నాయకులను, అధికారులను, మోదీ రాజకీయ సహచరులను, కుటుంబ సభ్యులను, చిన్ననాటి మిత్రులను కలుసుకుని సమాచారం సేకరించి ఆయన రాసిన కథనం ఇది. రెండేళ్ళ క్రితమే కారవాన్ మేగజైన్లో ప్రచురితమయింది. ఎనిమిదేళ్ళ వయస్సులో ఆర్ఎస్ఎస్ 'బాల స్వయం సేవక్' గా మారినప్పటి నుంచి ఇటీవలి వరకు మోదీ రాజకీయ జీవితాన్ని, అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కథనం ఇది. చదివి మీరే ఒక నిర్ధారణకు రండి.
భారతదేశ పార్లమెంట్పై దాడి కేసులో జైలుపాలయి ఉరితీయబడ్డ అఫ్జల్ గురు ను తీహార్ జైలులో ఇంటర్వ్యూ చేసి వినోద్ రాసిన 'ములాఖత్ అఫ్జల్' కథనానికి విశేష ప్రాచుర్యం, పాఠకాదరణ లభించాయి. పలుమార్లు ప్రచురితమైన ఆ కథనం పదకొండు విదేశీ భాషల్లోకి అనువాదమైంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good