నవ్యవీక్లి తలమానికం మొదటిపేజి. నవ్యవీక్లి తలవాకిలి మొదటిపేజి. నవ్యవీక్లి తెరిస్తే మళ్లీ మళ్లీ చదవాలనిపించేది మొదటిపేజి. మొదటిపేజి అంటే మంచితనం. మొదటిపేజి అంటే మానవత్వం. చీకటిలో చిరుదీపం మొదటిపేజి. గాలివానలో గుడిగోపురం మొదటిపేజి. వేసవివేళ వెన్నెలరాత్రి మొదటిపేజి. శీతల వేళ చలిమంట మొదటిపేజి. మొదటిపేజి చదవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు సృజించుకోవడం. తాతలూ, బామ్మలూ దూరమైన ఈ ఆధునిక కాలంలో పిల్లల్లా మిమ్మల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని, జీవితం అంటే ఏమిటో, జీవించడం ఎలాగే చెప్పే అవ్వమనసు మొదటిపేజి. జేజిమమత మొదటిపేజి.
మొదటిపేజి అంటే జగన్నాథశర్మ చిట్టిపొట్టి కథలు. సరికొత్త సంపాదకీయాలు. ఇందులో కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లు ఉన్నాయి. నవ్వులు ఉన్నాయి. నజరానాలు ఉన్నాయి. అద్దంలాంటి ఈ మొదటిపేజి చదవటం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం, మీనుండి మీరే ప్రేరణ పొందడం. మీ నుండి మీరే స్ఫూర్తిపొందడం. మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం. మరి ఎందుకు ఆలస్యం? అందుకోండి! 'మొదటి పేజి'.