పత్రికలకి సంపాదకీయం కోసం ఆరంభంలోనే ఒకచోటు కేటాయిస్తారు. నవ్యవ వీక్లీకి యీ ''మొదటి పేజి'' అలాంటిదే. పత్రికకి తొలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత, కాలమిస్ట్‌ శ్రీరమణ నవ్యవీక్లీ ఎడిటర్గఆ అలా తాపత్రయపడి వారం వారం రాసినవే యీ 243 మొదటి పేజీలు. ఒక్కోటి రెండు పేజీలు కూడా లేదు. క్లుప్తంగా ఆప్తంగా వుండాలన్నది లక్ష్యం. చదవకుండా ఎవరూ తొలి గడప దాటి వెళ్ళకూడదన్నది ఆశ. నవ్యవీక్లీలో వచ్చే రోజుల్లో ఎడిటర్‌ ఆశ నెరవేరింది. ఈ శీర్షిక బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో కొన్ని స్వీయానుభవాలు, కథారూపంలో సందేశాలు, ఆసక్తి ఆలోచన నిండిన పిట్టకథలు వున్నాయి. అన్నింటికీ చదివించే గుణం పుష్కలంగా వుంది. పుస్తకం పక్కన పెట్టాక కూడా కొన్ని మొదటి పేజీలు పాఠకుల మనసుల్లో రెపరెపలాడతాయి.

పేజీలు : 352

Write a review

Note: HTML is not translated!
Bad           Good