మన మొబైల్ ఫోన్లు 'ఆండ్రాయిడ్' ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంటే... అసలీ ఆండ్రాయిడ్ ఏమిటి... దాన్ని కనిపెట్టడానికి ఏ మేధో వర్గం అహర్నిశలు పనిచేస్తోంది. ఈ తరానికి సకల సౌఖ్యాలను సమకూరుస్తున్న బోలెడు సాంకేతిక ఆవిష్కరణల వెనుక ఎంతమంది మేధోజీవుల కృషి ఉంది. అలాగే వైద్య విద్యా రంగంలో వస్తున్న కృత్రిమ మేధో వృద్ధి ఎలా సంభవమౌతోంది. వంటి విషయాలవైపు సాధారణ పాఠకుడు దృష్టి సారించడు. ఐతే... మన అభ్యున్నతికోసం మానవ వికాసంకోసం, మానవ బహుముఖీన ఉన్నతికోసం తెరవెనుక శ్రమిస్తున్న అజ్ఞాత ఉన్నత విద్యావంతుల తపస్సమాన నిరంతర శ్రమకూడా ఉందని... ఒక కొత్త పార్శ్వాన్ని పాఠకులకు పరిచయం చేయాలన్న సంకల్పంతో అనేక అత్యాధుఎనిక సాంకేతిక పరికల్పనలతో కూడిన కథావస్తువును తీసుకుని ప్రతీకాత్మకంగా ఈ చిన్న నవల 'మొదటి చీమ'ను మీకోసం సృజించాను. నిస్సందేహంగా ఇది ఉబుసుపోక, కాలక్షేప నవల కాదు. దీనికి ఒక ప్రయోజనం... లక్ష్యం ఉంది. - రామా చంద్రమౌళి
పేజీలు : 110