'వాక్యం రసాత్మకం కావ్యం' అనేది నానుడి అయితే 'జీవితం రసాత్మకం నాటకం' అనేది న్యూనుడి! కావ్యగతమైన లక్ష్యాలకు, లక్షణాలను ప్రతి బిందువులోనూ సదృశ్యం చేస్తూ వాక్యాలు రసాత్మకంగా ఇమిడి రస సిద్ధిని కలుగజేస్తే జీవితానికి వ్యాఖ్యానం లాంటి ప్రక్రియ నాటకం. జీవన రసాస్వాదనకు దోహదపడుతుంది.

ప్రజల గుండె చప్పుడు రంగస్థలం... మానసిక, నైతిక, ఆథ్యాత్మిక, విప్లవ భావావేశాన్ని సందేశ సారాన్ని అందించే ఈ మాధ్యమంపై పిల్లల చిరుసవ్వడిని, వాళ్ళ అంతరంగాలను, ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉత్సాహంగా... ఉద్వేగంగా.. సద్వినియోగం చేసుకుంటూ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ థియేటర్‌ 12వ, రాష్ట్రస్థాయి బాలల నాటకోత్సవాలు నిర్వహించింది.

ఇందులో ప్రదర్శితం అవుతున్న నాటకాలన్నీ దేనికదే ఓ మచ్చుతునక. సమాజ ధోరణులపై గట్టి చురక! చదువుకోవటం మానేసి ''చదువు కొనటం'' మొదలై చాలా ఏళ్లు అయింది. పిల్లల్ని చదివే యంత్రాలుగా తమ అభిరుచికి ప్రతినిధులుగా తయారుచేస్తున్న పేరెంటింగ్‌ వైఖరులపై సున్నిత హెచ్చరిక 'స్వేచ్ఛాగీతం' నాటిక. ఇది ఇవాల్టి ప్రతీ కుటుంబం చూసి తీరాల్సిన నాటిక. 'చందమామ రారా' ఓ ప్రయోగాత్మక ప్రయోజనాత్మక నాటిక. 'అయ్యోపాపం.. కుయ్యోమొర్రో' కూడా ఇవాల్టి విద్యా ధోరణులపై ఛర్నాకోలా. ఇదే కోవలో సాగే 'నాని' కూడా ఓ మంచి ఆలోచన రేకెత్తించే నాటిక. ఇంకా ''ఒన్స్‌ అపాన్‌ ఏ టైం ఓ అక్క - ఓ తమ్ముడు, తల్లీ నిన్ను దలంచి, అమ్మ పుట్టిన ఊరు' నాటికలు దేనికవే వైవిధ్యభరితమైన కోణాలలో బాలల అతరంగాలను, ఆత్మలను ఆలోచనలను ఆవిష్కరించాయి. - సి.పార్థసారథి

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good