శ్రీ మల్లాది  వెంకటకృష్ణమూర్తి గారు రచయిత అయిన తొలి రోజుల్లో రాసిన నవల మిసెస్‌ పరాంకుశం. మల్లాదిని పాఠకుల ముందు నిలిపిన, ఆంధ్రప్రభ, వార పత్రికలో సీరియల్‌గా వెలువడ్డ నవల ఇది. ఇతివృత్తం - పరాంకుశం ఓ బజారు వేశ్యని వివాహం చేసుకుని ఆమెని ఓ చక్కటి ఇల్లాలిగా తీర్చిదిద్దాలనే ఆశయం కలవాడు. ఈ ప్రయత్నంలో పరాంకుశానికి ఎదురైన అనేక అనుభవాలు, పరాభవాలు ఎంతో సహజంగా ఆసక్తి కలిగేలా మల్లాది చిత్రించారు. మరి అతను ఈ ప్రనయత్నంలో విజయం సాధించాడా? -- ఈ ఆఫ్‌బీట్‌ వలన చదివితే తప్పక తెలుస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good