'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్‌ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్‌ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార్థసారథి. ఇలాంటి హిపోక్రసీనే ''హిపోక్రైట్స్‌'' కథలోనూ, ''మంగళగౌరీవ్రతం' కథలోనూ చెప్తారు. అలాగే ఎంతోమంది రచయితల హిపోక్రసీని 'ప్రేరణ' కథలో చెప్తారు.

ఒక రోగిష్టి భార్య వున్న భార్త, అలాగే రోగిష్టి భర్త వున్న భార్య - వారి శారీరక అవసరాల కోసం ఏ రకమైన హిపోక్రసీని ఆశ్రయిస్తారో తెలుసుకోవాలంటే 'ఆరాధ్యదేవత' కథ చదవాలి.

ఇలా ఈ సంకలనంలోని 35 కథల్లోనూ పార్థసారధిగారు ఇవాల్టి సమాజంలోని వివిధాంశాల్ని మానవనైజంలోని విచిత్రాల్ని, వైరుధ్యాన్ని ఎంతో నేర్పుగా, సునిశిత దృష్టితో స్పృశిస్తారు.

ప్రేమ, వివాహం, వివాహేతర సంబంధం, కార్మికుల యూనియన్‌లో మనుషుల ప్రలోభాలూ, ఆత్మవంచనలు, ఆఫీసు ఆడిట్లలో నేరాల్ని కప్పిపుచ్చే వ్యవహారాలు, ఎన్నో మనముందు నిలుస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good