ఈ సంపుటిలోని కథల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం.  ప్రతీ కథా ఇతివృత్తం కూడా క్రైమ్‌కి సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కథలని ఇష్టపడే పాఠకులకి ఇవన్నీ నచ్చుతాయి.  మొదటిసారి ఇలాంటి కథలని చదివే పాఠకులు ఈ తరహా చిన్న క్రైమ్‌ కథలతో ప్రేమలో పడటం ఖాయం.  ప్లేబాయ్‌, న్యూయార్కర్‌, ఎల్లరీ క్వీన్స్‌ మిస్టరీ మేగజైన్‌ లాంటి ప్రసిద్ధ పత్రికల్లో అచ్చయిన ఇవన్నీ నాణ్యత గల మంచి కథలే.  చక్కటి శైలితో సులువుగా చదివించేలా రాయబడ్డ ఇవన్నీ మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good