ఈ 'మైండ్‌ పవర్‌' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరంభం నుంచీ, అంతం వరకూ రచయిత తన సహజశైలిలోని జిగి, బిగిని సడలనివ్వలేదు. ఇతర 'పర్సనాలిటి డెవలప్‌మెంట్‌' పుస్తకాల లాగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేసే పుస్తకం కాదిది.

జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఇందులో పొందుపరచారు. అందువల్ల ప్రతివ్యక్తీ దీనిని పదేపదే చదివి తీరాల్సిందే. అసామాన్యులు మెదడు చెప్పినట్లు చేయకుండా, తాము చెప్పినట్లు 'మెదడు' నడుచుకునేటట్లు 'ట్యూన్‌' చేసుకుంటారు. అలాంటివారే నెంబర్‌వన్‌ కాగలుగుతారు. మనిషిని మెదడు వాడుకునే దశనుండి మెదడును మనిషి వాడుకునే దశకు చేరుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్‌ 'మైండ్‌పవర్‌' మంచి అక్షర సాధనం కాగలదు.

సామ్యవాదం కోసం మనోశక్తి, మనో ప్రణాళిక, మనోధైర్యం, మనో విశ్లేషణ, మనశ్శాంతి కాక 'ఆర్ధికావగాహనావలోకం' కోసం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అదే పాజిటివ్‌ థింకింగ్‌ అనుకుంటే ఇది అవశ్య పఠనీయ గ్రంథం. పాఠకుడి మానసిక స్థాయిని పెంచి తద్వారా సమస్యల్ని పరిష్కరించే ఆత్మవిశ్వాసాన్నీ, నేర్పునీ, అందించిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good