పాలి బౌద్ధ సాహిత్యంలో మిలిందపఞ్హది ప్రతేకస్థానం. జనరంజకత, ప్రామాణికత రెండూ కలిగిన గ్రంథంగా ఇది కీర్తింపబడింది. ఆచార్య బుద్ధఘోషుడు (క్రీ.శ.5వ శతాబ్ది) తాను రచించిన త్రిపిటక వ్యాఖ్యానాల్లోనూ, విసుద్ధిమగ్గ లోనూ తరుచుగా మిలిందపఞ్హది వాక్యాలను ప్రమాణంగా చూపించారు. బర్మాబౌద్ధులకు ఈ గ్రంథం అంటే అమిత గౌరవం.
ఇద్దరి మధ్య జరిగిన సంభాషణే ఈ గ్రంథం. మిలిందుడు అనే రాజు, నాగసేనుడనే భిక్షువు మధ్య జరిగిన సంవాదరూపం. ఇద్దరూ చారిత్రక పురుషులనడంలో సంశయం ఎవరికీ లేదు. మౌర్యసామ్రాజ్య పతనం ప్రారంభం కాగానే (చక్రవర్తి అశోక మరణం క్రీ.పూ.227 తరువాత) భారత ఉపఖండం వాయువ్య భాగాలు గ్రీకురాజుల ఏలుబడిలోకి చేరి పోయాయి. ఆ రాజుల్లో ఒకడు మినందర్. ఈ మినందర్ రాజ్యం ఇప్పటి పంజాబు, ఆఫ్గనిస్థాన్ ప్రాంతాలుగా చారిత్రికులు నిర్ణయించారు. మినందరే ఈ గ్రంథంలో మిలిందుడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good