మిథునం ఒక జీవితం. బంగారు మురుగు. ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాధ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరు పేరునా, ప్రతి కథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, ''తేనెలో చీమ'' లో కూడా తేనె వుందన్నారు. తినబోతూ రుచేల? ఈ సంపుటిలో కథలు గొప్పవి కాక పోవచ్చు గాని, లక్షణంగా చదివించేస్తాయి. మిథునం కథా సంపుటి కుటుంబ సభ్యులందరికీ తలొక కాపీ వుండాలి. ఎందుకంటే ఎవరి టేస్టు వారిది! - శ్రీరమణ
Pages : 147