జీవించి ఉండడానికి శ్వాసక్రియ ఆహారం ఎంత అవసరమో విజయం సాధించడానికి సాధన కూడా అంతే అవసరం. మీరు కోరుకున్నవి అనుకున్నవి చేయడానికి సాధించడానికి.. కావలసిన వనరులన్నీ ఈ విశాల విశ్వంలో పుష్కలంగానే ఉన్నాయి. అయినా మీరు పరాజితులుగా జీవిస్తున్నారంటే.. కారణం, మిమ్మల్ని మీరు గుర్తించక పోవడం. మీలో అంతర్గతంగా దానియున్న శక్తిని వినియోగించు కోలేక పోవడం మాత్రమే.  విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీ విజయానికి మీరే సారధిగా మారి -- మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దుకోవడం కోసం - మీ బలహీనతల్ని బలాలుగా మార్చుకొని భయాలకు లోబడకుండా దొరకిన అవకాశాల్ని వినియోగించు కోవడం కోసం - మీ కమ్యూనికేషన్ స్కిల్ల్స్ గుర్తించి మంచి సంభాషణా చతురులుగా మారడం కోసం- మీ అంతర్గత శక్తులను గుర్తించి వాటిని పటిష్టం చేసుకోవడం కోసం - మానవ సంబధాలను అభివృద్ధి చేసుకోవడం కోసం. - టెన్షన్ నిరాసక్తతతను నియంత్రించు కోవడం కోసం - అంతిమంగా విజయాలను స్వంతం చేసుకోవడం కోసం. - అందరికి సులభంగా అర్ధం అయి. ఆచరణ యోగ్యంగా రూపొందించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం " మీ విజయానికి సారధి మీరే ".

Write a review

Note: HTML is not translated!
Bad           Good