నేను, నా కుటుంబం తెలంగాణే ఆశగా, శ్వాసగా ఉన్నం. సోయి వచ్చినప్పటిసంది ఈ గడ్డ కోసమే బతికినం. నిజాం కాలంల భూస్వామ్యశక్తుల చేతుల్లో తల్లి తెలంగాణ నరకయాతన పడుతుంటే నేను చూడలేక పోయిన. అందుకే తెలంగాణ విముక్తి పోరాటంల దునికిన. భరతమాత గుండెలపై మణిపూసగా తెలంగాణ ఒదిగిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలతో నాతో పాటు ప్రతీ తెలంగాణ బిడ్డ దల్లడిల్లిండు. ఆధ్రలో విలీనం తరువాత నా తెలంగాణ పడ్డ అరిగోసను చూస్తూ అనుక్షణం బాధపడ్డ. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండనే సచ్చిపోతనేమో అని చాలామంది ఆందోళన చెందారు. కానీ నేను తెలంగాణ చూసేదాంక బతికి ఉండేందుకు పోరాడిన. సోనియాగాంధీ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. సీమాంధ్రలో పార్టీని చంపుకుని మరీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ యాద్‌ మరవద్దు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good