ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండో భాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమై, కేపిటలిజం మాజీ సోషలిస్టు దేశాలకు కూడా విస్తరించి నేడు కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది.
ఒక వ్యవస్ధకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్ధితి ఏర్పడినప్పుడు, ఆ వ్యవస్ధ సంపూర్ణ విజయం సాధించినట్లే. ఈ అర్ధంలో కేపిటలిజం, సోషలిజం మీద సంపూర్ణ విజయం సాధించిందని మనం అంగీకరించకవచ్చు. మన మనసు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నేటి వాస్తవ పరిస్ధితి ఇది.
కానీ....
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు ఉద్యమం చిన్నాభిన్నమయిపోయి, 'మార్క్సిజాన్ని నిలువులోతులో పూడ్చి పెట్టేశాక' కేపిటలిజం సురక్షితంగా ఉందా? లేక 'కమ్యూనిస్టు భూతం' ఇంకా దాన్ని వెంటాడుతూనే ఉందా?
సోషలిస్టు శిబిరం ఎందుకు, ఎలా కూలిపోయింది? ఈ ఘోర పరాజయంతో అంతా ముగిసిందా? లేక వెనక్కు మళ్ళిన విప్లవ తరంగం ఈ శతాబ్దంలో మరింత విస్తృతంగా, మరింత ఉధృతంగా మరోసారి విరుచుకు పడబోతోందా?
సోషలిస్టు శిబిర పతనం తర్వాత 'మార్క్సిజం మరణించిందా?' లేక సజీవంగానే ఉందా?
అసలు మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిజం అంటే ఏమిటీ?

Write a review

Note: HTML is not translated!
Bad           Good