"శ్రీమద్రామాయణ కల్పవృక్షం" వ్రాస్తూన్నప్పుడు విశ్వనాథ వారిని ఎవరో అడిగారట ఇలా... "లోకం మీద ఇన్ని రామాయణాలుండగా, మీరూ రామాయణం దేనికి వ్రాయడం?" అని. దానికి విశ్వనాథ వారు తమ పీఠికలో 'మరల నిదేల రామాయణం బన్నచో..." అంటూ వివరణ విస్తారంగానే ఇచ్చారు. ఇన్ని వంటల పుస్తకాలుండగా, మళ్లీ ఈ వంటల పుస్తకం దేనికీ? అనే సందేహం మీకు కలగవచ్చు! దీనికి అంత వివరణ అవసరం లేదు. లోకం మీద ఎన్ని వంటల పుస్తకాలున్నా, ఇంటర్నెట్లో విస్తృతంగా సమాచరం ఉన్నట్లే ఈ మెగా కుకింగ్ బుక్‌లోనూ వీలైనంత విస్తారంగా అన్నిరకాల వంటలకూ చోటు కల్పించాలన్న సంకల్పమే ఈ సంకలనం తేవడానికి కారణం! - పబ్లిషర్స్. |