ఈ పుస్తకం మీరెందుకు చదవాలి? ఎందుకంటే... ఒక గొప్ప విజయవంతమైన, ప్రశంసింపబడే జీవితాన్ని నిర్మించుకోవటానికి ఈ పుస్తకం సాయపడుతుంది. ఇది ఒక వంటల పుస్తకం లాంటిది. ఇందులో కావలసిన పదార్ధాల జాబితా ఉంటుంది- అవే సూత్రాలు - విజయాన్ని పొందాలంటే వాటిని మీరు తెలుసుకోవాలి. ఆ పదార్ధాల్ని సరైన పాళ్ళలో కలిపి తయారు చేసే విధానం కూడా ఈ పుస్తకంలో చెప్పబడింది. విజయాన్ని సాధించాలన్న కలల స్ధాయినుంచి మీలో నిబిడీకృతమైన శక్తుల్ని ఉపయోగించి, విజయాన్ని ఎలా సాధించాలో తెలిపే పుస్తకం. మిమ్మల్ని మీ లక్ష్యం వైపుకి తీసుకెళ్ళే పుస్తకమిది. విజేతలు భిన్నమైన పనులు చేయరు. వారు భిన్నంగా పనిచేస్తారు. జీవితంలో ఉన్నతిని సాధించగోరే వారికి మార్గదర్శి అయిన శ్రీ శివ్ ఖేరా యు కెన్ విన్ ఆంగ్ల గ్రంథానికి ఆర్.శాంత సుందరి గారి తెలుగు అనువాదమిది. |