కుక్కలను పెంచేవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయని. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో వున్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు ఒకసారి నేర్పించారంటే ప్రాణాలను తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్క ఉండేది. ఆయనక్కాస్త తిక్క. కొండల్లో రెండు శిఖరాల మధ్య ఓ హెయిర్‌పిన్‌ బెండ్‌లో కట్టుకున్నాడు ఇల్లు. ఆ ఒంటరి మనిషికి కుక్క తోడు. వర్షాలకు కొండచరియలు విరిగి పడుతున్నప్పుడు కింద డ్యూటీలో వున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు ఆయన ఎర్రజెండా వూపి సైగచేసేవాడు. అది సంకేతంగా ఘాట్‌రోడ్డు మీద వాహనాల రాకపోకల్ని నియంత్రించేవాళ్ళు.

ఒకనాడు కింద ట్రాఫిక్‌ హెవీగా వున్నప్పుడు రాళ్ళు పడటం ప్రారంభమైంది. మొదట తాతగారి తలమీద రాయిపడటంతో ఆయన స్పృహ కోల్పోయాడు. అంతే. కుక్క తెలివేమిటో అప్పుడు తెలిసొచ్చింది. అది వెంటనే ఇంట్లోకెళ్ళి రెడ్‌ టవల్‌ ఒకటి తీసుకుని చెంగుచెంగున గెంతుతూ కింద వున్న కానిస్టేబుల్‌ దగ్గరకెళ్ళింది. ఆ సిగ్నల్‌ అర్ధం చేసుకున్న కానిస్టేబుల్‌ ట్రాఫిక్‌ను తక్షణమే ఆపేశాడు. ఆనాడు కుక్కే లేకపోతే ఎన్ని వందల ప్రాణాలు పోయేవో గదా!

''నిజమే. కుక్క కున్న బుద్ధి మనుషులకు లేదు కొయ్యి'' అన్నాడు డిటెక్టివ్‌.

అవన్నీ కోతలని డిటెక్టివ్‌ కెలా తెలిసింది?

Write a review

Note: HTML is not translated!
Bad           Good