బాబ్రీ మసీదును రాజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాడంటే

నేను హిందువును కాను

నాస్తికుడైతే తప్ప

కమ్యూనిస్టు కానేరడు అంటే

నేను కమ్యూనిస్టును కాను

అవినీతిని తాత్వీకరించుకున్న దొంగలరాజ్యమ్‌లో

ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్‌ కోసమే

నేను దళితవాదిని కాను.

భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని

గుర్తించి ఆమోదిస్తే తప్ప

నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను.

రచయిత బండి నారాయణ స్వామి

Write a review

Note: HTML is not translated!
Bad           Good