పసుపుకాళ్ళతో కొంగు కొంగు ముడివేసుకున్న కొత్త జంట పవళింపు సేవకు ఆయత్తమవుతుండగా, తన తండ్రి మరణానికి కారణమైంది ఈ అమ్మాయి తండ్రే అనే దుర్వార్త కథానాయకుడి గుండెల్లో అగ్గిభరాటాలను రేపింది.

అతనా పారాణి తడి ఆరని ప్రియురాలిని ఏం చెయ్యాలి? మీరైతే ఏం చేస్తారు?

తన తల్లి ఆ పెళ్ళికూతుర్ని సమర్థించి దంపతుల్ని దగ్గరకు చేర్చింది.

ఆ తల్లికే ఈ విషవార్త తెలిసి కోడల్ని వదిలెయ్యమని శాపించింది.

అప్పుడు

మీరైతే ఏం చేస్తారు?

తన అక్క భర్త ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే దూరమైన ఆ ఇల్లాలే తనను పరిత్యజించిన భర్తకు సాయంచేసింది. ఈ విషయం మీకు తెలిసినా, లోకానికి తెలియాలంటే - మీరైతే ఏం చేస్తారు?

ఈ కథ అంతా అతనికి అన్ని కోణాల్నుంచి దగ్గిరైన ఓ అమ్మాయికి తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసుకోవాలంటే...

- ఈ నవల చదివి తీరవలసిందే!

పేజీలు : 271

Write a review

Note: HTML is not translated!
Bad           Good