మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారా? మీరు మీ శక్తి సామర్థ్యాలను వాటి గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అవును, అయినట్టయితే ఈ పుస్తకం మీరు తప్పక చదవాలి!
 
              'మీపై నమ్మకం ఉంచండి' పుస్తకంలో మానవ నిక్షిప్తశక్తి ఉద్యమ పురోగాముల్లో ఒకరైన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ - మీ కలలను సాకారం చేసుకుని మీ జీవితంలో ఘనవిజయం సాధించడం ఎలాగో చూపిస్తారు. మనం ప్రతి ఒక్కరం పుట్టుకతోనే బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాం. సరైన మానసిక వైఖరితో - విజయవంతం కావడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అందుకు మీ సుప్తచేతనాత్మక మనసుకు శక్తినిచ్చే ఇంజనులాంటి చేతనాత్మక మనసును ఉద్దీపనం చేయగలగాలి. అప్పుడు ఇది మీ ఆశలనూ, ఆశయాలనూ పూర్తిస్థాయిలో సాధించే మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఆయత్తం చేసే అసలు పనిని చేస్తుంది.
                    కవులు, కళాకారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు - ఇలావిభిన్న రంగాలలో విజయాలు సాధించినవారు - తమ సుప్తనాత్మక మనసును ప్రోగ్రామింగ్ చేసి క్రమబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి తమ కలలను, భావాలను లాభదాయకమైన రీతిలో ఎలా అమలు చేసేవారో తెలుసుకుని, మీరు కూడా మీ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి, అలాంటి మెళకువలను అమలు చేయడం సునాయాసంగా నేర్చుకోగలుగుతారు

Write a review

Note: HTML is not translated!
Bad           Good