Rs.200.00
In Stock
-
+
కొన్ని పట్టుదలుంటాయి . జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలలో అప్పుడప్పుడూ కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణ వేణమ్మ వాళ్ళ జరిగిన అవమానం అహర్నిశలూ గుర్తొస్తూ రక్తాని మరిగించే పట్టుదలగా మారింది. కాని మేనత్త కూతురు మీనాని చూశాక మనసులో ఏదో తియ్యటి సంచలనం తలెత్తింది.
కొన్ని మనస్తత్యాలుంటాయి. ఇంకో పిల్లపుడుటే వున్నా ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగి పోతుందేమో, తన తల్లి ప్రేమని భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది
తన మనస్సు కూతురు మనస్సు ఒక్కటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురికి అందించాలని మీనాకు నచ్చని సారధిని అల్లుడిగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి ఆమె.
వీరందరి పట్టుదలలు, పంతాలు, ఆశనిరాశలు, కోపతాపాలు సజీవ సమ్మేళనమే మీనా నవల
చదువుకున్నెందుకు రెండు భాగాలుగా ప్రచురించారు. రెండూ ఒకేసాని తీసుకోవలసి వుంటుంది.