మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు, మీకు మీరేం చెప్పుకోవాలి
మీ దృక్పథాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళిక మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.
నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.
నాలో ప్రతిభ, సామర్ధ్యం, నైపుణ్యం అన్నీ వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాదను.
ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.
నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.
నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.
ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ షాడ్ హెల్మ్ స్టెట్టర్ మనకీ పుస్తకం ద్వారా సానుకూల స్వయంభాషణతోపాటు అనేక విషయాలను ఎలా చేసుకోవాలో చెబుతారు. ఒక ప్రియతమ మిత్రునికి మీరే ప్రేమతో కూడిన నిశ్చలమైన ఊతమివ్వండి. మీలో వుండే నిరంతర ప్రోత్సాహాకుని శక్తిని ఒడిసి పట్టుకోండి.