విజ్ఞాన శాస్త్ర సంబంధమైన హేతుబద్ధత, సాహిత్య అధ్యయనంతో అలవడిన శైలి, మీడియా ఉద్యోగంతో ఒనగూడిన అవగాహన ముప్పేటగా కలిసిన పరిణితి నాగసూరి వేణుగోపాల్‌ మీడియా విశ్లేషణలో సుస్పష్టం. తెలుగులో టీవీ చానళ్ళు విచ్చుకుంటున్న తొలిదశలోనే నాగసూరి బుల్లితెర కార్యక్రమాల వస్తువు, శిల్పం, ఉద్దేశం, భాష, వ్యక్తీకరణలతోపాటు సాంకేతిక విషయాలను కూడా వివరిస్తూ ఏవారానికి ఆ వారం విశ్లేషణలు కొనసాగించారు. తెలుగు టీవీ తొలి సమగ్ర విశ్లేషకులుగా టీవీ ముచ్చట్లు, ఛానళ్ల విస్తృతి - సీరియళ్ల వికృతి, చానళ్ల సందడి - టెక్నాలజీ హడావుడి, సమాచారం బాట - సంచలనాల వేట పుస్తకాలను వెలువరించారు.

జాతీయ, ప్రాంతీయ చానళ్ళలో వచ్చే అనేకానేక కార్యక్రమాలపై సమాచారం ఈ పుస్తకంలో ఉంది. జర్నలిజం సంబంధిత రంగాలలో పరిశోధన చేసే సామాజిక పరిశోధకకులకు ఓ గొప్ప నిధి ఈ పుస్తకం. జర్నలిజం విద్యార్ధులకు, జర్నలిస్టులకు, మీడియా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఈ చానళ్ళ హోరు - భాష తీరు ఒక కరదీపిక. సమాజసేవకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ మాధ్యమాన్ని ఒక మహత్తరమైన సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుపుతూ లోటుపాట్లను రచయిత చాలా స్పష్టంగా చెప్పగలిగారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good