నేటి మన సమాజంలో రోజురోజుకీ ఆరోగ్యం పట్ల అవగాహన అధికమవుతోంది. అందుకు కారణం రోగాలు అధికం కావటం మాత్రమే కాకుండా వాటికి తగ్గ వైద్య చికిత్సలు కూడా విరివిగా అందుబాటులోకి రావటం. కార్పోరేట్‌ ఆస్పత్రుల నుంచి వీధివీధిలో వెల్లువెత్తుతున్న వివిధ ఆస్పత్రులను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

పూర్వం ఇలా ఉండేది కాదు, అప్పట్లో అసలు రోగాలు రొష్టులే తక్కువగా ఉండేవి. ఎప్పుడన్నా చిన్నచిన్న జ్వరాలు రావటం తప్ప సీరియస్‌ జబ్బులు అంతగా కనిపించేవి కావు. ఒకవేళ అలాంటివి వచ్చినా గ్రామాలలో ఉండే నాటువైద్యులు మూలికలు, చిట్కాలతో వాటిని కట్టడి చేసేవారు. పాతతరం మనుషులలో స్వతహాగా ఉండే రోగనిరోధకశక్తి కడా ఆయా రోగాలు తగ్గుముఖం పట్టటానికి దోహదం చేసేది.

కాని నేటి ఆధునిక యుగంలో అట్లా కాదు. వాతావరణంలో కాలుష్యం, ఆహార పదార్థాలలో కల్తీ, సంక్లిష్ట జీవన విధానల మూలంఆ ఏర్పడుతున్న మానసిక ఒత్తిళ్ళు, ఇలాంటివన్నీ కలిసి మనిషిని వేగంగా అనారోగ్యంలోకి నెడుతున్నాయి. ఒకప్పుడు మనిషిలో ఉన్న రోగనిరోధకశక్తి ఇప్పుడు అంతగా కనిపించటం లేదు. జీవన విధానంలోని పెడధోరణులు ఎయిడ్స్‌లాంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో ఏ చిన్న మార్పు జరిగినా, ఎంత చిన్న క్రిమి లేక వైరస్‌ శరీరం మీద దాడి జరిపినా అతను రోగగ్రస్తుడయిపోతున్నాడు. దాని నుంచి కోలుకోవటానికి ఎన్నో వ్యవయప్రయాసలకు లోనవాల్సి వస్తోంది.

Pages : 199

Write a review

Note: HTML is not translated!
Bad           Good