సమస్యలను పరిష్కరించే విధంగా ఇష్టమైన రంగాలలో రాణించడానికి కొన్ని చిట్కాలు అందచేయడమే ఈ పుస్తక లక్ష్యం. బాగా చదువుకుని మంచి పర్సంటేజ్ మార్కులు తెచ్చుకునే విద్యార్ధులకు సైతం ఇంటర్ కు వచ్చే సరికి వారిపై అధిక వత్తిడిని పెంచేందుకు ఇంకా మంచి ర్యాంకు సంపాదించేందుకు పిల్లలను రెసిడెన్సియల్ కాలేజీలలో చదివిస్తున్నారు. అందువల్ల కొంతమందికి పిల్లలు కొత్త ప్రదేశం కొత్తచోటు , హాస్టల్ వాతావరణానికి ఇమడ లేక ఇంటి మీద బెంగతో చదువులో వెనక బడిపోతున్నారు. వారికి ఉన్న నిజమైన తెలివి తేటలు ఉపయోగించుకోలేక సతమతమవుతూ డిప్రెషన్ కు గురవుతున్నారు. పిల్లల చదువుకు అప్పో సొప్పో చేసి ఇన్వెస్ట్ చేసిన పెద్దలు అది కార్య రూపం దాల్చకపోవడంలో అగ్గి మీద గుగ్గిలం అవుతూ పసి హృదయాలను కర్కుశంగా నలిపివేస్తున్నారు. . తల్లి దండ్రులు ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. - బ్రతకడానికి ఎన్నో మార్గాలు- సంపాదనకు కోటి దారులు.. చదువు సంస్కారాని పెంచాలేగాని రంగాలలో చేర్పించడానికి సహకరించండి. పిల్లలను కాలేజీలలో చేర్పించేటప్పుడు వారిని అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకోండి.మరి మి పిల్లలు వారి ఇష్టమైన రంగాలలో మేధావులు గానే మిగిలి పోతారు. అవసరం అనుకుంటే సైకాలజిస్ట్ వద్దకు తీసుకు వెళ్లి కెరీర్ పై శ్రద్ధ తీసుకోండి. |