ప్రబంధ ప్రహేళికలు అంటే నాకు ప్రత్యేకమైన
అభిమానం, ఆసక్తి అని నా పాఠకులకు
తెలుసు. చాలా సంవత్సరాల క్రితం
రచన మాసపత్రికలో, వాకిలి వెబ్ పత్రికలో, అమెరికా
భారతి పత్రికలో ఎన్నో నెలల పాటు
క్రాస్ వర్డ్ పజిళ్ళ శీర్షికలను సాగించాను. వాటికి మంచి స్పందన వచ్చిన
సంగతి చాలా మందికి తెలుసు.
అసంఖ్యాకంగా కూర్చిన పదబంధ ప్రహేళికలతో నాలో ఒకలాంటి సాచురేషన్ ఏర్పడిరదనవచ్చు. పైగా వాటికోసం గ్రిడ్లను తయారు చేసేందుకు చాలా శ్రమించాలి. ఆ పని విసుగును తెప్పిస్తుంది కూడా. వీటి కారణంగా పద్ధతిని మార్చాను. గ్రిడ్లు లేకుండానే ప్రశ్నలు ` జవాబుల రూపంలో పెట్టాలనుకున్నాను. ఆ నిర్ణయం ఫలితమే ఈ మేధామథనం.
ఉదాహరణ :
చాకుతో, బాకుతో తోలు తీసేస్తే మిగిలేది ఏమిటి?
జవాబు : చాకు, బాకు. ఎట్లా అంటే, ‘చాకుతో బాకుతో’ లో రెండు ‘‘తో’’లు (తో అనే అక్షరాలు రెండు) తీసివేయబడినాయి.
పేజీలు : 168