శరీరాన్ని జీవంతో కొనసాగించేది మెదడు. అందులోని వంద బిలియన్‌ కణాలు రకరకాల పనులు అన్నింటినీ నడిపిస్తాయి. ఊపిరితీయడం, గుండె కొట్టుకోవడం, రక్తంపోటు నుంచి మొదలు ఆకలి, దపిప్క, లైంగికత, చివరికి నిద్రదాకా అన్నీ మెదడు కారణంగానే జరుగుతాయి. అనుభవాలు, భావాలు, అవగాహనలు, ఆలోచనలు... అన్నీ మెదడు కారణంగానే పుడతాయి. అనీన& కలిసి మనకు ఒక నడవడిని ఏర్పాటు చేస్తాయి. చేసే పనులన్నింటికీ ఆదేశాలు మెదడునుంచే వస్తాయి. మనం ఉన్నామని, మనకు ఒక మెదడు ఉందని అర్థమయిందంటే, అది కూడా మెదడు కారణంగానే.

మొత్తానికి మెదడు మిగతా శరీర భాగాల వంటిది కాదని, చాలా ప్రత్యేక మయినదని అర్థమయింది. ఈనాటికీ మెదడు గురించిన పరిశోధనలు మొత్తం రహస్యాలను విప్పి చెప్పలేకపోయాయి. అయినా మెదడు గురించి, అందులో జరగుతున్న మార్పుల ప్రభావాల గురిచి, ఆ రకంగా మనుషులలో కనిపిస్తున్న తీరు గురించి చాలానే తెలిసింది.

ప్రపంచమంతటా జీవశాస్త్రం, వైద్యం పరిశోధనలలో మెదడుగురించిన పరిశోధనలు చాలా విస్తృతంగా ఉంటున్నాయి. మెదడులో జరుగుతున్న మెరుపువేగం కరెంటు ప్రసారాల గురించి అర్థం చేసుకున్నారు. మెదడులోని కణాలు, వాటి మధ్య సంబంధాల గురించి కూడా తెలుసుకున్నారు. శరీరమంతా ఈ రకం కణాలు విస్తరించి ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెదడుకు పంపించే తీరను అర్థం చేసుకున్నారు. ఈ సమాచారం వెళ్లే దారులగురించి ఎంతో తెలిసింది. ఈ తతంగమంతా మన శరీరంలో నడుస్తున్నదని, కనుకనే మనం మనముగా ఉండ గలుగుతున్నామని అర్థం చేసుకుంటే గొప్ప ఆనందం కలుగుతుంది.

గోపాలం కె.బి.

Pages : 258

Write a review

Note: HTML is not translated!
Bad           Good