ఉపచేతనాధ్యయనవేత్త విలువైన సలహాకు తొలి ముద్రణ

దశాబ్ధాల తరబడి డాక్టర్‌ జోసెఫ్‌ మర్ఫీ సాగించిన అధ్యయనం, ప్రసంగాల ఆధారంగా ఈ కొత్త రచన రూపొందింది. మీకు అభిరుచి వున్న వృత్తి, వ్యాసంగాల్లో విజయాల్ని సాధించడానికి అనుగుణంగా మీ ఉపచేతనాశక్తిని ఎలా వినియోగించుకోవచ్చునో ఈ పుస్తకం విశదపరుస్తుంది.

వృత్తి, వ్యాసంగాల్లో కొత్త పుంతల్ని తొక్కిన అనేకమంది వ్యక్తుల నిజజీవితానుభవాల్నే సోదాహరణంగా తీసుకుని వెలువరించిన రచన ఇది. అతిసరళమైన చిన్న చిన్న మార్పుల్ని చేసుకోవడం ద్వారా వృత్తిపరంగా లక్ష్యాలిన్న సాధించడంలోను, వాటిని విస్తృతపరచుకోవడంలోను ఈ పుస్తకం మీకు సహాయకారిగా ఉంటుంది. ఇవాళ ఈ పుస్తకం సహాయంతో మీరు చేసే ఏ పనైనా మీ జీవితపర్యంతమూ శాశ్వత విలువ కలిగిన సానుకూల ఫలితాన్ని మీకు అందిస్తుంది.ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.
- మీ లక్ష్యాల్ని నిర్వచించుకోవటం, వాటిని సాధించడం
- ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ విలువను వృద్ధి చేసుకోవడం
- ఆందోళనను అధిగమించడం
- మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకోవడం
- చెడు అలవాట్లని వదుల్చుకోవటం
- నాయకునిగా ఎదగడం
- ఇబ్బందిపెట్టే వ్యక్తులతో సామరస్యంగా ఎలా మెలగాలో నేర్చుకోవడం
- సమయపాలన పాటించడం
- మీ ఆలోచనల్నీ, భావాల్ని వాణిజ్యపరంగా చక్కగా వాడుకోవడం
- మీ వృత్తి, వ్యాసంగాల్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడం

Write a review

Note: HTML is not translated!
Bad           Good