అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన ఈ పుస్తకం మీలో దాగిఉన్న గొప్ప శక్తిని సంపాదించుకునేందుకు అవసరమైన ఉపాయాన్ని మీకు అందిస్తుంది. మనస్తత్వ శాస్త్రంలాంటి ఈ పుస్తకం తమ సుప్తచేతనకునన నమ్మశక్యం కాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి నేర్పింది. సుప్తచేతన మనం చేసే ప్రతి పనిమీదా తన ప్రభావాన్ని చూపుతుందని డా.మర్ఫీ తన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ, శాస్త్రీయ పరిశోధనలతోనూత స్పష్టం చేస్తాడు. వాస్తవ జీవితానుభవాలతో నిండిన ఈ పుస్తకం, మీరు ఎంచుకున్న రంగంలో విజయాల్ని ఎలా సాధించాలో మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం ద్వారా మీ సుప్త చేతనకున్న శక్తిని ఉపయోగించి మీరు పొందగలిగే లాభాలు:
- ఆరోగ్యాన్ని మెరుగుపరుచోగలుగుతారు. రోగాలని నయం చేసుకోగలుగుతారు.
- ప్రమోషన్‌ సంపాదించుకోగలుగుతారు, మరింత జీతం తెచ్చుకోగలుగుతారు, పేరు సంపాదించుకోగలుగుతారు.
- కోరుకున్న సంపద సంపాదించుకోగలుగుతారు.
- స్నేహితుల సంఖ్య పెంచుకోగలుగుతారు. కుటుంబంతో, సహోద్యోగులతో, స్నేహితులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.
- మీ వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలని బలపరుచుకోగలుగుతారు.
- భయాలనీ, చెడు అలవాట్లనీ వదిలించుకోగలుగుతారు.
- ''నిత్య యౌవనులుగా'' ఉండే రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు.
ఈ పుస్తకం మీకు అంతులేని సంపదనీ, ఆనందాన్నీ, మనశ్శాంతినీ సంపాదించుకోవడానికి మార్గదర్శిగా ఉపయోగపడగలదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good