మహేంద్రుని దేవసభలో మానవ సంగీతంలో నిష్ణాతులయిన గాయకులచే గానసభ జరిగే సమయంలో తన శిష్యుడు మణికంధరునితో కలిసి సభలో ప్రవేశించబోయిన నారదుని, అర్హత లేదన్న నెపంతో లోనకు ప్రవేశించనీయలేదు నాట్యరాణి రంభ. దీనితో కోపించిన నారదుడు ఎలాగైనా రంభకు గర్వభంగమొనర్చాలని భావించి, రంభకు సవతిపోరు కలగాలని ఆకాంక్షించాడు.

అది తెలిసిన రంభ నివారణోపాయం కోసం భూలోకంలోని మేఖలావర్తుడు అనే సిద్ధుని కలవడానికి వెళ్ళగా దుర్మార్గుడైన  అతని శిష్యుడు కేతుబాహుడు రంభను అపహరించి బంధించాడు.

అతని బారినుండి రంభ ఎలా తప్పించుకుంది?

ఆమెకు సవతిపోరు కలిగిందా?

రంభ ప్రేమ కోసం తపస్సు చేసిన మణికంధరుడు రంభ ప్రేమను పొందగలిగాడా?

మణికంధరుని ప్రేమించిన కృష్ణ పరిచారిక కలభాషిణి అతనిని దక్కించుకుందా?

ఈ మాయారంభ ఎవరు?

మధ్యలో కొన్ని ఉపకథలతో, భూలోకంలోని ఉదంతాలతో ఆధ్యంతం పాఠకులని సమ్మోహితుల్ని చేస్తుందీ రచన.

వెయ్యి నవలలరచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహంగారు 'భయంకర్‌' అనే తన కలం పేరుతో రచించిన మాయా -తంత్ర - మంత్ర సమన్విత గాధ ఈ మాయారంభ.

పేజీలు : 261

Write a review

Note: HTML is not translated!
Bad           Good