ఈ కథా సంపుటిలో

1. కళ తప్పుతోంది 2. సాలభంజికలు 3. ఒక అబద్ధం 4. అలజడి 5. మాయజలతారు 6. ప్రయాణం

7. వూబి 8. లోహముద్ర 9. మూడో పాదం 10. బతుకొక పండగ 11. రెండు రెళ్ళు 12. అడవి

        13. మాట్లాడే దేవుడు 14. పోలిక 15. కొడుకొచ్చాడు 16. డైనింగ్‌ టేబుల్‌ అనే 16 కథలు ఉన్నాయి.


        కళ తప్పుతోంది : ''ఈసారి ఏం నాటకం వేద్దాం?'' ఆ గదిలో సమావేశమై ఉన్న మిగతా వారివైపు చూస్తూ అన్నాడు సత్యమూర్తి. అతనికి నలభై ఐదేళ్ళ వయసుంటుంది. స్ఫురద్రూపం... వొత్తుగా జుట్టు... నుదుట బొట్టు...

        దానికి సమాధానం చెప్పకుండా ''ఈ రోజు హాట్‌ న్యూస్‌ ఏంటో తెలుసా? కోల్‌కతాలో నాటక ప్రదర్శనకు టిక్కెట్లు బ్లాక్‌లో కొంటున్నారట. మనకా రోజులు ఎప్పుడొస్తాయో'' అన్నాడు సాయి. అతని వయసు అరవైయేళ్ళు. తెల్లబడిన జుట్టు కన్పించకుండా నెలకోసారి రంగు వేసుకోడానికైనా బద్ధకిస్తాడేమో కాని నాటకాల మీది మోజుతో మొహానికి రంగేసుకోవడం మాత్రం మానడు.....

పేజీలు : 163

Write a review

Note: HTML is not translated!
Bad           Good